Sunday, January 19, 2025
HomeTrending Newsపాడేరులో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

పాడేరులో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

ఆదివాసీలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, గిరిజన సంక్షేమ మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. గిరిజన జీవనవిధానం, స్థితిగతులపై ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేసి, ఈ రోజును ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు. పాడేరు ఇండోర్ స్టేడియంలో స్థానిక శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వేడుకలకు మంత్రి అమర్ నాథ్ తో కలిసి రాజన్నదొర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గిరిజనుల అభివృద్ధికి, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం కల్పించేందుకు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు.

గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పెట్టుబడుల శాఖల మంత్రి, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి  గుడివాడ అమర్ నాథ్ అన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోయినా, గిరిజన ప్రజలు జగన్ కు అండగా నిలిచారని,  2019 లో వైసీపీ అధికారంలోకి రావడంలో గిరుపుత్రుల సహకారం మరువ లేనిదని కొనియాడారు.  సిఎం జగన్ కు గిరిజనులపై ప్రత్యేక ప్రేమ ఉందని,  అందుకే ఎస్.టి. సబ్ ప్లాన్ కింద 14 వేల కోట్ల ఖర్చు చేశారని, లక్షా 50 వేల కుటుంబాలకు రెండున్నర లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టి, 8 వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను అందించారని పేర్కొన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గిరిజన ఈ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేసిన చేశారని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు, జడ్పీ చైర్మన్ సుభద్ర, ఎమ్మెల్యే ఫల్గుణరావు, జి. సి .సి. చైర్మన్ స్వాతి రాణి తదితరులు పాల్గొన్నారు….

RELATED ARTICLES

Most Popular

న్యూస్