Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్పేదవాడు గౌరవంగా బతకాలంటే జగన్ మళ్ళీ రావాలి: మోపిదేవి

పేదవాడు గౌరవంగా బతకాలంటే జగన్ మళ్ళీ రావాలి: మోపిదేవి

ప్రభుత్వ పరిపాలన ప్రజల ముంగిటకు తీసుకువచ్చిన ఘనత సిఎం జగన్ కె దక్కుతుందని, ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మూడో సంవత్సరంలోనే జాతీయ స్థాయిలో జగన్ గుర్తింపు పొందారని రాజ్యసభ సభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు.  ఏ ఆలోచన చేసినా, ఏ కార్యక్రమం జరిపినా రాష్ట్రంలోని పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుంటారని, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళ్లి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవాన్ని తలెత్తుకొనేలా చేస్తున్నారని కొనియాడారు.  సామాజిక సాధికార బస్సు యాత్రతో చీరాల దద్ధరిల్లింది. బలహీనవర్గాలు ఏకమై సాధికారతను ఎలుగెత్తి చాటాయి. నియోజకవర్గ సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మ్మెల్సీ పోతుల సునీత, నాగార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సభలో మోపిదేవి మాట్లాడుతూ  14 ఏళ్లు సీఎం, 40 ఏళ్ల సీనియర్ అయిన చంద్రబాబు ఒకటైనా మంచి పథకం తెచ్చారా అని ప్రశ్నించారు. తాడూ బొంగరం లేని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రచారం చేయడం, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియా వత్తాసు పలకడం ఎంత వరకు ధర్మం, న్యాయమని నిలదీశారు.  ఎవరెన్ని రకాల తప్పుడు ప్రచారం చేసినా పేదవాడు గౌరవంగా బతకాలంటే జగనన్నే రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావాలని, దీనికి ప్రజలు కూడా ముక్తకంఠంతో సిద్ధమయ్యారని మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు.  అభ్యర్థుల మార్పుపై సోషల్ మీడియాలో ఎన్ని రకాల ప్రచారాలు వచ్చినా నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎంపీ నందిగం సురేష్ మాట్లాడిన ముఖ్యాంశాలు: 
* జగనన్న నాలుగున్నరేళ్ల పాలనలో మనందరం సంతోషంగా ఉన్నాం.
* చంద్రబాబు 14 ఏళ్ల సీఎం పాలనలో ఏమీ చేయలేకపోయాడు.
* 12 శాతం ఉన్న పేదరికాన్ని 5 శాతానికి తగ్గించిన దమ్మున్న మగాడు జగనన్న.
* ప్రతి ఒక్కరినీ లక్షాధికారుల్ని చేయాలన్న ఆలోచన చేసిన సీఎం జగనన్న
* పేదవాడి ముఖంలో చిరునవ్వులుచూడాలని ప్రయత్నిస్తున్న జగనన్న
* మన జీవితాల్లో వెలుగులు ఆర్పేసిన వ్యక్తి చంద్రబాబు
* చంద్రబాబు ఏనాడైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీల్ని నా వాళ్లు అన్నాడా? బాబుకు అణువణువూ కులగజ్జి.
* అమరావతి పేరుతో సర్వనాశనం చేసి లక్షల కోట్ల స్కాములు చేశాడు.
* బీసీలు, ఎస్సీలను చంద్రబాబు దొంగలుగా చూపించాలనుకుంటే జగనన్న మాత్రం పార్లమెంటులో కూర్చోబెట్టాడు.
* సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు. మొన్న జూనియర్ ఎన్టీఆర్ కు కూడా వెన్నుపోటు పొడిచాడు.
* నాలుగున్నరేళ్లలో ప్రతి పేదవాడూ బాగున్నాడు. పేదవాడు ఇంగ్లీషు మీడియం చదువుతున్నాడంటే జగనన్న కారణం.
* చంద్రబాబుకు మళ్లీ అవకాశం ఇస్తే అందరినీ సర్వనాశనం చేస్తాడు.
* అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామంటూ పొన్నూరు మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించాడు.
* ఒక్కసారి ఆ విగ్రహాన్ని తాకితే మా దమ్ము చూపిస్తాం.
* ఆ విగ్రహాన్ని తాకడం అంటే రాష్ట్రంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలను తాకడమే.
* పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి చంద్రబాబుకు తాకట్టుపెట్టాడు.
* తెలంగాణలో ఒకరు పార్టీ పెట్టి విలీనం చేసి ఇక్కడకొచ్చి మాట్లాడుతున్నారు.
* జగనన్న తర్వాతే మాకు ఎవరైనా, జగనన్న జోలికొస్తే ఎవరైనా ఊరుకోం.
* 17 మంత్రి పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చిన జగనన్న.
* సామాన్యులు సైతం డైరెక్టర్లు, చైర్మన్లు అవుతున్నారంటే జగనన్న గొప్పతనమే.
* మాదంతా లగాన్ టీమ్. మా గెలుపు తథ్యమే.
* చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఈ మధ్య వచ్చిన వారంతా పారిపోవాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్