అంబేద్కర్, జ్యోతిరావ్ పూలే ఆదర్శాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక సాధికారత అందించిన ఘనత సిఎం జగన్ దేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. మహానుభావులు ఉద్యమాలు చేసి, సాధించాలనుకున్న సాంఘిక న్యాయాన్ని ఆచరణలోకి తెచ్చారని కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో సామాజిక సాధికార యాత్ర విజయవంతమైంది. ఆరు మండలాల నుంచి విశేషంగా జనం తరలివచ్చారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రులు మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరామ్, ఎంపీలు నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేరుగ మత్లాతుఓ అణగారిన వర్గాలకు అన్నీ తానై భరోసాగా జగన్ నిలిచారని, కులమతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు, అన్ని సామాజిక వర్గాలకూ రాజకీయంగా ప్రాధాన్యమిచ్చారని వివరించారు. గతంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చులకనగా చూసి అవమానిస్తే… జగన్ మాత్రం ఆయా వర్గాలను అక్కున చేర్చుకుని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థాయికి చేర్చాలని తపిస్తున్నారని చెప్పారు.
తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ – రాప్తాడు నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న నీటి సమస్యకు సిఎం జగన్ పరిష్కారం చూపారని, పేరూరు డ్యాంకు మూడు సంవత్సరాలు వరుసగా నీళ్లు తీసుకొచ్చామని, నాల్గో సంవత్సరం వరుణదేవుడి ఆశీస్సులతో వర్షాలతో డ్యాం నిండిందాని, మూడు రిజర్వాయర్లు తెచ్చుకున్నామని వివరించారు. పీఏబీఆర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఆత్మకూరు, అనంతపురం రూరల్‌కు నీరు ఇచ్చేలా, ఇంటింటికీ కుళాయి ఏర్పాటు పనులు జరుగుతున్నాయని తెలిపారు. డీబీటీ, నాన్ డీబీడీ ద్వారా 2,500 కోట్ల రూపాయలను రాప్తాడు ప్రజలకు అందించారన్నారు. అలవిగాని హామీలిచ్చి అధికారంలో రావాలన్నదే చంద్రబాబు కుటిల నీతి అని విమర్శించారు.