Tuesday, March 10, 2026
HomeTrending Newsమహిళల మద్దతుతో జగన్ దే పీఠం: పరిపూర్ణానంద

మహిళల మద్దతుతో జగన్ దే పీఠం: పరిపూర్ణానంద

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని స్వామి పరిపూర్ణానంద జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీకి 123 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళల ఓట్లలో అధికశాతం జగన్ కు పడ్డాయని… వారి మద్దతుతోనే ఆయన తిరిగి ఎన్నిక కాబోతున్నారని చెప్పారు. ఎన్నికల ఫలితాలను నిశితంగా, కచ్చితంగా అంచనా వేసే ఓ వ్యక్తి తనకు ఈ విషయం చెప్పారని, ఆయన పేరు వెల్లడించలేనని చెప్పారు. మహిళల ఓట్ల శాతం అనుకున్నదానికంటే ఎక్కువగా వైసీపీకి పడి ఉంటే ఈ సంఖ్య గతంలో వచ్చిన దానికంటే 151 ని దాటి 158 వచ్చే అవకాశం ఉందన్నారు. కేంద్రంలో మోడీ సొంతంగానే మెజార్టీ సాధిస్తారని, రాష్ట్రంలో జగన్ అధికారం మళ్ళీ చేపడతారని స్పష్టం చేశారు. తాను ఎవరినీ ఆషామాషీగా నమ్మే వ్యక్తిని కానని, కానీ గత నాలుగైదు ఎన్నికల్లో ఆయన అంచనాలు నూటికి నూరు శాతం నిజం అయ్యాయని పేర్కొన్నారు. మోడీ 3.0 వెర్షన్.. జగన్ 2.0 వెర్షన్ గా ఉంటుందని అభివర్ణించారు.

హిందూపురం నుంచి బిజెపి తరపున పోటీ చేయాలని భావించిన పరిపూర్ణానంద… ఈ సీటును టిడిపికి కేటాయించడంతో స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలోకి దిగారు. ఆయన నేడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల ఫలితాలపై తనకు వచ్చిన ఓ విశ్వసనీయ సమాచారాన్ని వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular