Friday, November 22, 2024
HomeTrending Newsవైసీపీ ఎమ్మెల్యేలకే జగన్ పై నమ్మకం లేదు: అచ్చెన్న

వైసీపీ ఎమ్మెల్యేలకే జగన్ పై నమ్మకం లేదు: అచ్చెన్న

వైసీపీ శాసనసభ్యులకే  సిఎం వైఎస్ జగన్ పై నమ్మకం లేకుండా పోయిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. శాసనసభ ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా సభలో కేవలం ముగ్గురు వైసీపీ సభ్యులే ఉన్నారని, అందుకే పది నిమిషాలు ఆలస్యంగా బెల్లు మోగించారని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులుగా, సభలో తమకు అవకాశాలు ఇవ్వకపోయినా, అవమానపరిచినా, బాధ్యతగా సభకు వస్తున్నామని తెలిపారు. ఐదేళ్లుగా ఈ సభలో ఎలాంటి చట్టాలు చేసినా అవి రాష్ట్ర వినాశానానికే దారితీసేవిగా ఉన్నాయని అచ్చెన్నాయుడు విమర్శించారు.

కాగా, బిజెపి ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారని, రెండ్రోజుల్లో పార్టీ నేతలతో సమావేశంపై పొత్తు విషయంలో సమిష్టిగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం అవకాశం ఉందని అచ్చెన్న వెల్లడించారు. నిన్న ఢిల్లీలో ఏం మాట్లాడారనేది అటు అమిత్ షా, నడ్డా గానీ; ఇటు చంద్రబాబు గానీ చెప్పలేదని తెలిపారు.  అమిత్ షా కాళ్ళు  చంద్రబాబు మొక్కుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫేక్ ఫొటోను షేర్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఖర్మ మీకే పట్టిందంటూ వైసీపీని ఉద్దేశించి అన్నారు.

శాసనసభను చీకటి సభగా చేశారని, నేడు కూడా యాత్ర సినిమా కోసం సభను రెండు గంటలపాటు సభలు వాయిదా వేశారని టిడిపి నిరసన వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా తాము సభను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఐదేళ్లపాటు ఈ ప్రభుత్వం వినాశకర చట్టాలు చేసిందని నినాదాలు చేస్తూ ఆయా చట్టాలు, జీవోల ప్రతులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తగులబెట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్