Thursday, March 12, 2026
HomeTrending NewsRajinikanth: జగన్ అదుపులో ఉంచుకోవాలి: బాబు

Rajinikanth: జగన్ అదుపులో ఉంచుకోవాలి: బాబు

తమిళ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.  వారి నీచమైన వ్యాఖ్యలు సమాజంలో అందరినీ  బాధిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సిఎం జగన్ తన పార్టీ నేతలను అదుపులో పెట్టుకోవాలన్నారు.  దీనిపై సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

“అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని…అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ @rajinikanth గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు…ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి….జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular