చంద్రబాబు తన పదవీకాలంలో సామాజిజవర్గాలమధ్య చీలికలుతెచ్చి రాజకీయ పబ్బం గడుపుకున్నారని, అయన చేసినవన్నీ కుట్ర కుట్రపూరిత రాజకీయాలేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి ఆరోపించారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తోన్న సామాజిక సాధికార బస్సు యాత్ర చిత్తూరులో జరిగింది. భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. నాలుగున్నరేళ్ల సీఎం వైయస్ జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన మంచిని నేతలు ప్రజలకు వివరించారు. సామాజిక సాధికారత గతంలో ఒక కలగా మిగిలిందని , సిఎం జగన్ దాన్ని నిజం చేసి చూపారని అన్నారు.
నారాయణస్వామి మాట్లాడుతూ….
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక సాధికార యాత్ర.. ఓ చారిత్రక సందర్భంలో సాగుతున్న జైత్రయాత్ర.
- బడుగు బలహీన వర్గాల ప్రజలకు, ఈ నాలుగున్నరేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన మేలు అంతా ఇంతా కాదు.
- దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంతగా చెయ్యలేదు. మన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చర్చగా మారాయి.
- చంద్రబాబు హయాంలో బీసీలకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. బాబు నాడు అన్నీ అబద్ధాలే చెప్పి మోసం చేశారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధికార పదవుల్లోనూ వాటా ఇచ్చి ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి,
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 90 శాతం పదవులు, పథకాలు, బడుగు, బలహీనవర్గాలకే కేటాయించారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు, సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేసింది జగన్ ప్రభుత్వమే.
- 8మంది బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే. 23మంది బీసీలకు ఎమ్మెల్సీ పదవులను ఇచ్చిందీ ఆయనే.
- బాబాసాహెబ్ అంబేద్కర్, ఫూలే ఆశయాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి మన జగనన్న.
- మన మంచి భవిష్యత్తు కోసం.. మనం జగనన్నను మళ్లీమళ్లీ గెలిపించుకోవాలి.
డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడిన ముఖ్యాంశాలు:
- వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో.. అసలు సిసలు సామాజిక సాధికారత కనిపిస్తోంది. సామాజిక న్యాయం జరుగుతోంది.
- అణగారిన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూసిన రోజులకు కాలం చెల్లి… బ్యాక్‌బోన్ బలం మీరేనంటున్న జగనన్న పాలన వచ్చింది.
- మైనార్టీనైన నాకు ఉపముఖ్యమంత్రి పదవినివ్వడం నాకే కాదు.. మైనార్టీలకు సంబంధించి కూడా ఓ గొప్ప చారిత్రక సందర్భం అని పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడు మస్తాన్‌రావు ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
- గతంలో ఎన్నడూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసిన పరిస్థితి లేదు.
- జగనన్న ప్రభుత్వంలో పరిస్థితి మారింది. ఈ వర్గాలకు పిలిచి మరీ సీట్లు ఇచ్చిన చరిత్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది.
- దళిత వర్గాలు ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ముందంజ వేశాయన్నా, వేస్తున్నాయన్నా.. నాడు వైయస్సార్, నేడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిల చలవే. – తండ్రిని మించిన తనయుడిలా జగన్ పాలన సాగిస్తున్నారు.
- బడుగు బలహీనవర్గాల పిల్లలు చదువుల్లో ముందుండాలని మనసారా కోరుకుంటూ, వినూత్న పథకాలు తెచ్చిన ఘనత జగనన్నదే.
- నిజమైన సామాజిక న్యాయాన్ని ఇప్పుడే చూస్తున్నాం.