కృష్ణా జలాల్లో ఏపీ వాటాను గతంలో కంటే రెట్టింపు జగన్ హయంలోనే సాధించామని, నిన్న తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఏపీకి నీటి హక్కుల విషయంలో జగన్ ఏమీ చేయలేదని విమర్శించే టిడిపి, జన సేన లకు నిన్నటి ఉత్తమ్ వ్యాఖ్యలు సమాధానం చెప్పాయని అన్నారు. పోతిరెడ్డిపాడును వైఎస్ హయంలో చేపట్టినప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకించారని, అయినా సరే ధైర్యంగా వైఎస్ ముందుకు వెళ్ళారని, ఇప్పుడు జగన్ కూడా దాని సామర్ధ్యం పెంచారని వివరించారు. ఈనెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో జరగనున్న వైఎస్సార్సీపీ సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీ విద్యానాం కాదని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ లతో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమన్నారు. 2018లో తెలుగుదేశం పార్టీ 6౦ లక్షల దొంగోట్లను చేర్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు.