Sunday, January 19, 2025
HomeTrending Newsమేమంతా సిద్ధం -నేటి నుంచి జగన్ ప్రచార యాత్ర

మేమంతా సిద్ధం -నేటి నుంచి జగన్ ప్రచార యాత్ర

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  ఎన్నికల ప్రచార యాత్ర నేటి నుంచి మొదలు కానుంది. ‘మేమంతా సిద్ధం’ పేరిట కొనసాగనున్న బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి ప్రారంభమవుతుంది.

ఉదయం 11 గంటలకు తాడేపల్లి లోని నివాసం నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటలకు ఇడుపులపాయ లోని వైయస్‌ఆర్ ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తారు. అనంతరం 1.30 గంటలకి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో భాగంగా ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి, వేంపల్లి,సర్వరాజుపేట,వీరపునాయనిపల్లి (కమలాపురం),, గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు,యర్రగుంట్ల (జమ్మలమడుగు), పొట్లదుర్తి, మీదుగా సాయంత్రం 4.30 గంటలకి ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల,నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్,చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేయబడిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్