Friday, March 20, 2026
Homeసినిమా“రుద్రంగి” అందరికీ నచ్చుతుంది - జగపతి బాబు

“రుద్రంగి” అందరికీ నచ్చుతుంది – జగపతి బాబు

జగపతిబాబు ముఖ్య పాత్రలో నటించిన ‘రుద్రంగి’. ఈ చిత్రానికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. ఇందులో మమత మోహన్ దాస్, విమల రామన్‌లు నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం జులై 7న థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల సందర్భంగా జగపతి బాబు చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఇంతకీ జగపతి బాబు ఏమన్నారంటే.. “రుద్రంగి మూవీ ప్యాషన్‌తో చేశాను. డైరెక్టర్ కథ చెప్పిన విధానం.. కాన్ఫిడెంట్ నచ్చింది. మనసులో ఓకే అనుకున్నాను కానీ.. కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ చేయగలరా అనే అనుమానంతో… చేయలా వద్దా అని అనుకున్నా. ఎందుకంటే బడ్జెట్ ఎక్కువగా ఉన్న మూవీ. నేను అనుకున్నదాని కంటే ఎక్కువ అయింది.

గేమ్ ఆఫ్ త్రోన్స్ రేంజ్‌లో అజయ్ తీశాడు. క్యాస్టింగ్ కూడా దొర, దొరసానిల లుక్‌ కూడా వేరుగా ఉంది. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. పెద్ద బడ్జెట్ అనే పాయింట్ ఇవాళ దాటిపోయింది. డబ్బులు పెడితే సూపర్ హిట్ అనేది కాదు. రీసెంట్‌గా సామజవరగమన మూవీని చూశాం. ఈ సినిమా పోరాటానికి సంబంధించినది కాదు. ఫ్యామిలీ డ్రామా. మహిళల మధ్యన.. భర్తల మధ్యన.. భార్యల లవర్స్ మధ్యన ఎలా జరుగుతుందనేది కథ. కొత్తగా ఉంటుంది. సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. జనానికి నచ్చింది. ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్‌ అని కూడా చెప్పలేను. కానీ ఈ విలన్ కూడా నచ్చుతాడని అనుకుంటున్నాను.

నాది వైల్డ్ క్యారక్టర్. ఆ రోజుల్లో ఆ దొరలు.. ఆ బానిసలు ఎలా ఉంటారనేది ఉంటుంది. మూడేళ్లు సినిమాలు లేకుండా ఇంట్లో కూర్చున్నప్పుడు లెజెండ్ అవకాశం వచ్చింది. బోయపాటి శ్రీను సాలీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. బాలయ్య గారు ప్రతి నాయకుడు ఎవరు అని పట్టించుకోరు. ఆయన కాన్ఫిడెంట్‌తో వెళ్లిపోతుంటారు. ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అది అందరూ సెకెండ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టారు. ఈ మూవీతో నేను థర్డ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టుకుంటున్నాను. క్యారెక్టర్‌లో దమ్ము ఉంటుంది. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మంచి ఆకలి మీద ఉన్నప్పుడు.. మంచి పాత్ర చేయాలన్నప్పుడు రుద్రంగి వచ్చింది. ఈ సినిమా అందరికీ ఉత్సాహాన్నిచ్చింది. మా అందరికీ ఈ సినిమాలోని ఆత్మ కనెక్ట్ అయింది. అజయ్‌లో చాలా ప్యాషన్ ఉంది. తప్పకుండా పైకి వస్తాడు. అందరికీ నచ్చుతుది” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular