Sunday, January 19, 2025
HomeTrending NewsJaggareddy: నాలుగేళ్ల నుంచి దుష్ప్రచారం - జగ్గారెడ్డి

Jaggareddy: నాలుగేళ్ల నుంచి దుష్ప్రచారం – జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందని, ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాలుగేళ్ళ నుంచి నాపై ప్రచారం జరుగుతుందన్నారు. పార్టీ కోసం ఎంత చేసినా నన్ను ప్రశ్నిస్తున్నారు..కాంగ్రెస్ లో ఎందుకు ఈ పరిస్థితి ఉందొ అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

మీడియా అడిగే దాంట్లో తప్పు లేదని, రాహుల్ గాంధీకి అన్ని విషయాలు చెబుతా అని జగ్గా రెడ్డి స్పష్టం చేశారు. అన్ని అంశాలు రాహుల్ గాంధీకి వివరిస్తాను అన్న జగ్గారెడ్డి ఎన్నికల వ్యుహాలపై మాట్లాడేందుకు రాహుల్ గాంధీ పిలిచారని వెల్లడించారు. నేను పైరవి కారుణ్ణి కాదు..వాళ్ళు పిలిస్తేనే వచ్చానని తెలిపారు. పార్టీ ఐక్యంగా ఉందొ లేదో నేను చెప్పలేను…నేను చెప్పే వాణ్ణి కుడా కాదన్నారు. పార్టీ ఐక్యంగా ఉందో లేదో రాహుల్ గాంధీకి చెబుతా అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్