Sunday, January 19, 2025
HomeTrending Newsవిలేకరులపై దాడికి నిరసన

విలేకరులపై దాడికి నిరసన

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో… రాజ్ న్యూస్ బృందం విలేకరులపై దాడి ఘటనపై జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో…గత ఆదివారం ఆ ప్రాంత అభివృద్ధి పై చర్చా వేదిక నిర్వహిస్తున్న సమయంలో కొందరు దుండగులు రాజ్ న్యూస్ బృందం విలేకరులపై దాడి ఘటనను జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్ పై దాడిని ఖండిస్తూ…దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని  పాత్రికేయులు డిమాండ్ చేశారు.

హుజూర్ నగర్ లో రాజ్ న్యూస్ బృందం చర్చావేదిక నిర్వహించుచుండగా కొంత మంది దుండగులు రాజ్ న్యూస్ బృందం విలేకరులపై దాడి చేస్తూ… వారి దగ్గర ఉన్న కెమెరాలు,లైవ్ కిట్ మరియు వాహనాలను ఇతర సామగ్రిని ధ్వంసం చేస్తూ… రాజ్ న్యూస్ యాంకర్ లను, రిపోర్టర్ లను దూషించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ… జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ పక్షాన ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరుతూ….జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పాత్రికేయులు సిరిసిల్ల శ్రీనివాస్, సిహెచ్ వి ప్రభాకర్ రావు,మల్లారెడ్డి, గుగ్గిళ్ల నాగభూషణం, బి.శ్రీధర్ రావు, జహీర్, గోపి కృష్ణ రావు,వంశీ మారుతి పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్