ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు భారత పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ చారిత్రిక భవనాన్ని నేడు ప్రారంభించారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్ నారాయణ్ లు ఈ వేడుకలో ప్రధానితోపాటు ప్రసంగించారు.
సిఎం జగన్ తొలి వరుసలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి కూర్చుని ఈ వేడుక తిలకించారు. అంతకుముందు సర్వమత ప్రార్ధనలు నిర్వహించిన వారితో కలిసి జగన్ ఫోటో దిగారు.