Monday, March 9, 2026
Homeసినిమాఅక్టోబర్ 29న ‘జై భజరంగి’ విడుదల

అక్టోబర్ 29న ‘జై భజరంగి’ విడుదల

‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీచిత్రం ‘జై భజరంగి 2’. కరుండా చక్రవర్తి డా.శివరాజ్ కుమార్ హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం కన్నడ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సిద్ధమౌతోంది. డా.శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘భజరంగి’ 2013 లో కర్ణాటక రాష్ట్రంలో 212 థియేటర్లలో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో ‘భజరంగి-2’; తెలుగులో ‘జై భజరంగి’గా అక్టోబర్ 29న విడుదలవుతోంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ బాలాజీ వీడియో అధినేత నిరంజన్ పన్సారి ‘జై భజరంగి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ “గత 35 ఏళ్లుగా వీడియోరంగంలో వున్న ప్రసిద్ధ సంస్థ ‘శ్రీ బాలాజీ వీడియో’ ఇప్పటి వరకు షుమారు 400 చిత్రాలకు పైగా వీడియో హక్కులను పొందివున్నాం. మేమిచ్చే వీడియో నాణ్యతను గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగులో ‘మగధీర’ సినిమాతో బ్లూరేడిస్క్ ని మా సంస్థ ద్వారా పరిచయం చేశాం. తాజాగా డా. శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘జై భజరంగి’ చిత్రం తో టాలీవుడ్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. 2013 లో కన్నడ భాష లో విడుదలైన ‘భజరంగి’ శివ రాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular