Saturday, March 21, 2026
HomeసినిమాJames Gunn, Jr NTR: ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని వుంది - జేమ్స్ గన్

James Gunn, Jr NTR: ఎన్టీఆర్ తో వర్క్ చేయాలని వుంది – జేమ్స్ గన్

ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన చూసి మన దేశంలోని సినీ అభిమానులు, మూవీ మేకర్స్ మాత్రమే కాదు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. ఆస్కార్ బరిలో ఉత్తమ నటుడుగా ఎన్టీఆర్ నిలుస్తాడని గట్టిగా ప్రచారం జరిగింది. టాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో సైతం ప్రచారం జరగడం విశేషం. అక్కడ మ్యాగజైన్స్ సైతం ఎన్టీఆర్ ని అభినందిస్తూ స్పెషల్ ఆర్టికల్స్ రాశారంటే అర్థం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే… గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ అనే హాలీవుడ్ మూవీ డైరెక్టర్ జేమ్స్ గన్ ఇటీవల ఇంటర్ వ్యూలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలని వుందన్నాడు. గార్డియన్స్ ప్రపంచంలోకి భారతీయ నటులను తీసుకువచ్చే విషయం గురించి స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ మూవీలో పులులుతో ఫైట్ చేసే ఎన్టీఆర్ నటన ఆశ్చర్యానికి గురి చేసిందని.. తనలో కలిసి వర్క్ చేయాలని వుందన్నాడు. జేమ్స్ గన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు.

హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ ఇయర్ ఎండ్ లో వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ లో ఎన్టీఆర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. మరి.. భవిష్యత్ లో ఎన్టీఆర్ హాలీవుడ్ మూవీ చేసి చరిత్ర సృష్టిస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular