Tuesday, January 21, 2025
HomeTrending Newsదుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’కి పూజలు

దుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’కి పూజలు

ఆంధ్రప్రదేశ్ లో రాక్షస పాలన అంతం చేయడానికే వారాహి వాహనం ఏర్పాటు చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర దేవస్థానంలో పవన్ ప్రత్యేక పూజలు చేశారు. అనతరం కొండ కింద గుడి టోల్ గేటు వద్ద తమ పార్టీ ప్రచార వాహనం ‘వారాహి’కి పూజలు నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పవన్ వెంట ఉన్నారు. తొలిసారి వాహనం ఎక్కి దాను నుంచి అభిమానులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని దుర్గమ్మను వేడుకున్నట్లు పవన్ చెప్పారు. రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Also Read : కొండగట్టులో వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్