Friday, March 20, 2026
HomeTrending Newsరణస్థలంలో 12న జనసేన యువశక్తి బహిరంగ సభ

రణస్థలంలో 12న జనసేన యువశక్తి బహిరంగ సభ

ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో బహిరంగ సభ నిర్వహించనుంది.  ఈ కార్యక్రమానికి సంబంధించిన  పోస్టర్ ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్  ఆవిష్కరించి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.

యువతకు స్ఫూర్తిగా నిలిచినా స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుందని, రణస్థలంలో యువశక్తి తమ తడాఖా చూపించబోతోందని పవన్ కళ్యాన్  వెల్లడించారు. యువతీ యువకులు అందరూ ఈ సభకు ఆహ్వానితులేనని, యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా ఈ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.

మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఉత్తరాంధ్ర యువత ఉపాధి, చదువుల కోసం వలస వెళ్తోన్న పరిస్థితి ఆవేదన కలిగిస్తోందన్నారు. తనతో పాటు.. పార్టీ నాయకులు పాల్గొంటారాణి, యువత కూడా పాల్గొని అభిప్రాయాలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో పవన్ తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular