Saturday, November 23, 2024
HomeTrending Newsస్టీల్ ప్లాంట్ పై డిజిటల్ క్యాంపెయిన్‌

స్టీల్ ప్లాంట్ పై డిజిటల్ క్యాంపెయిన్‌

3 days digital campaign:
వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జనసేన పార్టీ తరఫున డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ప్రకటించారు.  రేపట్నుంచి మూడు రోజుల పాటు ఈ క్యాంపెయిన్‌ నిర్వహిస్తామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలంటూ వైఎస్సార్సీపీ ఎంపీలపై ఒత్తిడి పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి జన సైనికుడూ ప్లే కార్డులు ప్రదర్శించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ట్యాగ్ చేయాలని పవన్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని పవన్ కళ్యాణ్ విడుదల చేశారు.

⦿ 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పడం లేదు.
⦿ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానిదే బాధ్యత.. మనమేం చేయనక్కర్లేదనే ధోరణితో వైసీపీ ఉంది.
⦿ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీకి తన బాధ్యతను గుర్తు చేసేలా డిజిటల్ క్యాంపెయిన్‌.
⦿ డిసెంబర్ 18,19.20 తేదీల్లో మూడు రోజులపాటు ఈ క్యాంపెయిన్ చేపట్టాలి
⦿ పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలి.
⦿ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కలిసిన రావాల్సిన సమయం ఆసన్నమైంది.
⦿ రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలి.
⦿ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలి.
⦿ విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించవద్దని వైసీపీ కేంద్రాన్ని అడగాలి.. కేంద్రాన్ని అడగకుంటే తప్పు చేసినట్టు అవుతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్