Janashakti Movements In Telangana :
తెలంగాణలో మళ్లీ జనశక్తి నక్సల్స్ పురుడుపోసుకుంటున్నారు. జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దులోని పోతెనేపల్లి ఫారెస్ట్‌లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారని విశ్వసనీయ సమాచారం. సిరిసిల్ల, కొనరావుపేట్, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డి పెట్, గంభీరావ్ పేట్, ముస్తాబాద్‌కు చెందిన మాజీలతో ఈ భేటీ జరిగింది.
గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న జనశక్తి నక్సల్స్.. వ్యవస్థాపకులు కూర రాజన్న, కూర అమర్ లు కూడా సమావేశంలో పాల్గొన్నారని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సిరిసిల్లకు చెందిన మాజీ నక్సల్స్‌ని పిలిపించుకుని విశ్వనాథ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు మూడు కులాల ఆధిపత్యం గతంలో మాదిరిగా పెరిగిందని, ప్రభుత్వం వారికి అనుకులాంగానే వ్యవహరిస్తోందనే ఆరోపణలు, రాజకీయంగా ఉన్నత కులాల వారికే పదవులు దక్కుతున్నాయని సమావేశంలో చర్చించినట్టు సమాచారం. కాగా జనశక్తి మీటింగ్‌ఫై పోలీసులు సీరియస్ అయ్యారు. సమావేశానికి వెళ్లిన మాజీలను దేనిపై చర్చలు జరిగాయని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: పర్యావరణంతోనే మానవాళి మనుగడ