Saturday, January 18, 2025
Homeసినిమా'దేవర' షూటింగులో జాన్వీకపూర్!

‘దేవర’ షూటింగులో జాన్వీకపూర్!

ఎన్టీఆర్ హీరోగా .. యాక్షన్ – ఎమోషన్ ప్రధానముగా ‘దేవర’ సినిమా రూపొందుతోంది. కొసరాజు హరికృష్ణ –  కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమా షూటింగుకి సంబంధించిన విషయాలేవీ బయటికి పెద్దగా వదలకుండా సైలెంట్ గా పని కానిచ్చేస్తున్నారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులంతా కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన నాయికగా జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో ఆమె చేస్తున్న ఫస్టు మూవీ ఇదే. ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఆమె నిలవనుంది. అయితే ఆమె పోర్షన్ కి సంబంధించిన షూటింగు వివరాలు బయటికి వచ్చింది కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రీసెంటుగా ‘గోవా’లో మొదలైన షూటింగులో జాన్వీ కపూర్ జాయినైంది. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఆమెనే తెలియజేసింది. ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కొన్ని రోజుల పాటు ఇక్కడ చిత్రీకరించనున్నట్టుగా తెలుస్తోంది.

సముద్ర తీరప్రాంతంలో ఈ కథ నడుస్తుంది .. సముద్రమే ప్రధానమైన నేపథ్యంగా ఉంటుంది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్ .. ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడనే విషయం పట్ల  ఆయన ఫ్యాన్స్ అంతా చాలా ఆసక్తితో ఉన్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఎన్టీఆర్ నుంచి రానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్