Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ మూవీకి జాన్వీ సిగ్న‌ల్ ఇచ్చిందా..

ఎన్టీఆర్ మూవీకి జాన్వీ సిగ్న‌ల్ ఇచ్చిందా..

అతిలోక సుంద‌రి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ.. టాలీవుడ్ ఎంట్రీ గురించి గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. టాలీవుడ్ బ‌డా ఫిల్మ్ మేక‌ర్స్ జాన్వీని టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేయాల‌ని చాలా ట్రై చేశారు కానీ సెట్ కాలేదు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ మూవీలో విజ‌య్ స‌ర‌స‌న‌ జాన్వీని అనుకున్నారు. అంతా ఫిక్స్ అనుకున్నారు కానీ.. లాస్ట్ మినిట్ లో జాన్వీ నో చెప్పింది.

గ‌తంలో కూడా జాన్వీ కోసం టాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్స్ కాంటాక్ట్ చేయ‌డం.. ఆమె నో చెప్ప‌డంతో అస‌లు తెలుగు సినిమా చేసేందుకు జాన్వీకి ఇంట్ర‌స్ట్ ఉందా లేదా అనే అనుమానం కూడా వ‌చ్చింది. ఇదే విష‌యాన్ని బోనీ క‌పూర్ ని అడిగితే.. ఖ‌చ్చితంగా జాన్వీ తెలుగు సినిమాలో న‌టిస్తుంద‌ని చెప్పారు కానీ.. ఏ మూవీతో జాన్వీ తెలుగులో ప‌రిచ‌యం అవుతుంది అనేది మాత్రం చెప్ప‌లేదు.

ఇప్పుడు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి.. త‌న డ్రీమ్ గురించి క్లారిటీ ఇచ్చింది. ఇంత‌కీ జాన్వీ ఏం చెప్పిందంటే.. తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగులో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను కానీ.. కుద‌ర‌డం లేదు. జూనీయ‌ర్ ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించాలి అనేది డ్రీమ్ అని త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఎన్టీఆర్ కొర‌టాల శివ‌తో ఓ మూవీ, బుచ్చిబాబుతో ఓ మూవీ, ప్ర‌శాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నారు. మ‌రి.. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాలో అయినా ఎన్టీఆర్ తో క‌లిసి న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంటుందేమో చూడాలి.

Also Read : జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఈసారైనా నిజమయ్యేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్