Sunday, February 23, 2025
Homeసినిమా'పుష్ప 2'లో హైలైట్ గా నిలవనున్న జాతర ఎపిసోడ్! 

‘పుష్ప 2’లో హైలైట్ గా నిలవనున్న జాతర ఎపిసోడ్! 

పుష్ప‘ సినిమా సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇటు సుకుమార్ కెరియర్ లోను .. అటు బన్నీ కెరియర్ లోను ఈ సినిమా ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. బన్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. అలాంటి ఈ సినిమా సీక్వెల్ కోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతూనే ఉంది. అయితే అందుకు సంబంధించిన అప్ డేట్స్ ను మాత్రం వదలడం లేదు.

అయితే చాలా రోజుల క్రితమే బన్నీకి సంబంధించిన ఒక జాతర లుక్ బయటికి వచ్చింది. నిమ్మకాయల మాలను ధరించిన ‘మాతంగి’ తరహా బన్నీ లుక్ అందరిలో ఎంతో ఆసక్తినిపెంచింది. జాతర సమయంలో బన్నీ అలా కనిపిస్తాడని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పుకున్నారు. ఆ సన్నివేశాన్ని షూట్ చేశారా? .. చేస్తారా? అనే విషయం మాత్రం సందేహంగానే ఉండిపోయింది. కొన్ని రోజులుగా జాతర ఎపిసోడ్ కి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్నారనే సంగతి రీసెంటుగా బయటికి వచ్చింది. ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా చెప్పాడు.

రీసెంటుగా జరిగిన ‘మంగళవారం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి బన్నీ ముఖ్య అతిథిగా వచ్చాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ‘పుష్ప 2’ షూటింగు జరుగుతోందని ఆ సందర్భంలోనే చెప్పాడు. జాతర ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నామనీ, అందుకు సంబంధించిన మేకప్ ను తీసేసి వస్తున్నానని అన్నాడు. దాంతో ఆడియన్స్ లో మరింత కుతూహలం మొదలైంది. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ఈ జాతర ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందని సుకుమార్ కూడా చెప్పడంతో, జాతర ఎపిసోడ్ కి విజిల్స్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: Allu Arjun Finger Nail: పుష్ప రాజ్ పింక్ గోరు వెనకున్న కథ ఏంటి..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్