Sunday, January 19, 2025
Homeసినిమా సుమ`జయమ్మ పంచాయతీ` రిలీజ్ డేట్ ఫిక్స్

 సుమ`జయమ్మ పంచాయతీ` రిలీజ్ డేట్ ఫిక్స్

Jayamma joins you: ప్రముఖ యాంకర్, టెలివిజన్ ప్రెజెంటర్, హోస్ట్ సుమ కనకాల న‌టించిన తాజా చిత్రం `జయమ్మ పంచాయితీ` విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. సమ్మర్‌లో వచ్చే  సినిమాల‌ను చూసుకుని  చివరకు ఏప్రిల్ 22తో విడుద‌ల‌కు ఫిక్స్ అయినట్టు ఓ ఆహ్లాద‌ర‌క‌ర‌మైన వీడియో ద్వారా వారు తేదీని ప్రకటించారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వంలో వెన్నెల క్రియేషన్స్ పతాకం పై బలగ ప్రకాష్ నిర్మించిన ఈ పల్లెటూరి డ్రామా చిత్రం టీజర్, పాటలతో చాలా ఆసక్తిని రేకెత్తించింది. వారు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లతో ముందుకు రావడం ద్వారా ప్రమోషన్‌లను చేస్తున్నారు.

ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను కూడా ఆవిష్క‌రించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Also Read : ‘జయమ్మ పంచాయతీ’ పెద్ద హిట్ అవ్వాలి : రానా ఆకాంక్ష

RELATED ARTICLES

Most Popular

న్యూస్