Saturday, January 18, 2025
HomeTrending Newsమహాత్మా జ్యోతిభాపూలేకు నేతల నివాళి

మహాత్మా జ్యోతిభాపూలేకు నేతల నివాళి

వెనుకబడిన, అణగారిన వర్గాల కోసం క్రుషి చేసిన మహాత్మా జ్యోతిభాపూలే జయంతి సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ తెలంగాణ భవన్లోని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బహుజనుల, వెనుకబడిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిబాపూలే చేసిన సేవల్ని స్మరించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పూలే జయంతి వేడుకల్ని అధికారికంగా నిర్వహించడంతో పాటు పూలే పేరున బీసీ గురుకులాలు, విదేశీ విధ్యానిది పథకాల్ని అమలు చేస్తున్నామన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల యాసంగి వడ్లను కొనాలని ఢిల్లీలో చేస్తున్న మహాదీక్ష ప్రాంగణానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చేరుకున్నారు.

ఆయనతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ రాజ్యాంగ బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవద్దని రైతులు పండించిన పంటను వ్యాపార కోణంలో కాకుండా సామాజిక బాధ్యతతో చూడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో పథకాలు తెచ్చరని రైతుబందు, రైతుబీమా, 24 గంటల ఉచితకరెంట్, సాగునీరు అందించి రైతుల బాగుకోసం క్రుషిచేస్తున్నారని ఇలాంటి సమయంలో రైతుల పంటలను సేకరించకుండా కేంద్రం తెలంగాణ రైతులకు అన్యాయం చేయొద్దని, దేశమంతా ఒకే పంట సేకరణా విధానం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ ఛైర్మన్ రుద్రరాజు, నాయకులు చల్లా హరిశంకర్, కర్రా శేఖర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించిన చేవెళ్ల లోక్ సభ సభ్యులు డా.జి రంజిత్ రెడ్డి. డిల్లీ లోని తెలంగాణ భవన్ లో మహాత్మా జ్యోతిబా పూలే 196 జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  తలసాని శ్రీనివాస్ యాదవ్ మహాత్మా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ శాసన సభ్యులు అంజయ్య యాదవ్, రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లా DCCB చైర్మన్ నిజాం పాషా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్