Saturday, January 18, 2025
Homeసినిమాపరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష..

పరువునష్టం కేసులో జీవిత, రాజశేఖర్ దంపతులకు ఏడాది జైలుశిక్ష..

పరువునష్టం కేసులో ప్రముఖ తెలుగు సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ లకు నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా విధించింది. 2011లో దాతల నుంచి ఉచితంగా రక్తాన్ని సేకరించి మార్కెట్లో అమ్ముకుంటున్నారని చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై జీవిత, రాజశేఖర్ దంపతులు అసత్య ఆరోపణలు చేశారంటూ నిర్మాత అల్లు అరవింద్ పరువునష్టం దావా వేశారు.

చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపైన, ట్రస్టు పైనా అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు. వారు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను కోర్టుకు సమర్పించారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న  కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతోపాటు రూ. 5 వేల జరిమానా విధించింది. అయితే, జరిమానా చెల్లించడంతో పైకోర్టులో అప్పీలుకు అవకాశమిస్తూ బెయిలు మంజూరు చేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్