Saturday, January 18, 2025
Homeసినిమానేనూ పోటీలో ఉంటానంటున్న జీవిత

నేనూ పోటీలో ఉంటానంటున్న జీవిత

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు గతంలో ఎంత రసవత్తరంగా జరిగాయో తెలిసిందే. ఈసారి అంతకు మించి.. అనేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఓ వైపు ప్ర‌కాష్‌ రాజ్‌, మరో వైపు మంచు వారబ్బాయి విష్ణు పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రేసులోకి జీవితా రాజశేఖర్ కూడా వచ్చారు. ప్ర‌స్తుతం మా కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్న ఆమె ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. త్వ‌ర‌లోనే ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.

గత మా ఎన్నిక‌ల్లో న‌రేశ్ ప్యానెల్ తరఫున జీవిత‌, రాజ‌శేఖ‌ర్ లు క్రియాశీల పాత్ర పోషించారు. రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎన్నికలు పూర్తయిన కొద్ది కాలానికే న‌రేశ్‌తో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ లకు విబేదాలు ఏర్పడ్డాయి. నరేశ్ ఎవర్నీ సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ విభేదాలు మీడియాకు ఎక్కాయి కూడా.

ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో అప్పుడు సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు, జయసుధ రంగంలోకి దిగారు. ఇరువురికీ సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. ఈ పరిణామాలతో రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. జీవిత మాత్రం మాత్రం కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతూ వ‌చ్చారు. ఈసారి మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్‌ రాజ్‌, విష్ణు పోటీలో ఉన్నార‌ని తెలిసినా జీవిత పోటీ చేయాలనుకోవడం విశేషం. ఈసారి ఎన్నికలు ఎలాంటి వివాదాలు సృష్టిస్తాయో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్