Friday, March 20, 2026
Homeసినిమాఉత్కంఠను రేపుతున్న 'ఝాన్సీ' ట్రైలర్ .. సీజన్ 2 డేట్ ఫిక్స్! 

ఉత్కంఠను రేపుతున్న ‘ఝాన్సీ’ ట్రైలర్ .. సీజన్ 2 డేట్ ఫిక్స్! 

అంజలి ఇప్పుడు సినిమాల్లో కంటే వెబ్ సిరీస్ లో బిజీగా ఉంది. సరిగ్గా సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో ఆమె వెబ్ సిరీస్ లను పట్టుకుంది. అలా అని ఆమె ఏది పడితే అది ఒప్పుకోవడం లేదు. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే మాత్రమే అంగీకరిస్తోంది. ఆ మధ్య ఆమె నుంచి వచ్చిన వెబ్ సిరీస్ ‘ఝాన్సీ‘ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హాట్ స్టార్ వారు సీజన్ 1 బంచ్ లో 6 ఎపిసోడ్స్ ను అందించారు. ఈ 6 ఎపిసోడ్స్ కూడా చాలా ఉత్కంఠభరితంగా నడిచాయి.

ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 2ను వదలడానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 19వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అంజలి .. చాందినీ చౌదరి .. ఆదర్శ్ బాలకృష్ణ .. ఇలా ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆసక్తిని పెంచుతోంది. మొదటి సీజన్ లో తన గతం ఏమిటో తెలుసుకునే అన్వేషణ మొదలుపెట్టిన నాయిక, తన ప్రస్తుత పరిస్థితికి కారణమైనవారితో తలపడటమనేది సీజన్ 2 లో చూడొచ్చు అనేది అర్ర్థమవుతోంది.

కొంతమంది చావును తప్పించుకునేది సరైనవారి చేతిలో .. సరైన టైమ్ లో చావడానికి’ .. ‘సింహం ఎప్పుడిదైనా వీధి కుక్కను వేటాడటం చూశావా .. ఇప్పుడు చూస్తావ్’ వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ‘అంతా అయిపోయిందని అనుకుంటున్నావేమో .. అసలు కథ  ఇప్పుడే మొదలైంది’ అనే డైలాగ్ కూడిన హింట్ చూస్తే, మరిన్ని సీజన్స్ ఉంటాయనిపిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను ఫాలో అవుతున్న వాళ్లంతా తప్పకుండా వెయిట్ చేస్తూ ఉంటారు.

Also Read : గతాన్ని అన్వేషిస్తూ వర్తమానంతో పోరాడే ఝాన్సీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular