సినీ, టివి నటుడు ఎల్. జోగినాయుడుని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టింది. ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ క్రియేటివ్ హెడ్ గా నియామిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రజత్ భార్గవ ఈ మేరకు 17 ఫిబ్రవరి, 2023న జీవో నంబర్ 46 జారీ చేశారు. జోగినాయుడు నియామకానికి సంబంధించి ఏపీ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ విజయవాడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తదుపరి చర్యలు చేపట్టనున్నారని జీవోలో పేర్కొన్నారు.