Friday, March 13, 2026
Homeసినిమాఅభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ భారీ చిత్రాలు

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎస్‌వీసీ ఎల్ఎల్‌పీ భారీ చిత్రాలు

అభిషేక్ గ్రూప్ చైర్మన్ తేజ్ నారాయణ్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రకటన చేశారు. ఏషియన్ సినిమాస్ గ్రూప్ చైర్మన్ నారాయణ్ దాస్ కే నారంగ్ సంయుక్త భాగస్వామ్యంతో చిత్రాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి ( ఏషియన్ గ్రూప్ అనుబంధ సంస్థ) సంస్థలు సునీల్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, అభిషేక్ అగర్వాల్ లు కలిసి రాబోయే రోజుల్లో భారీ ప్రాజెక్ట్‌ లు నిర్మించబోతోన్నారు. హైద్రాబాద్‌కు చెందిన రెండు ప్రముఖ వ్యాపార కుటుంబాలు జాయింట్ వెంచర్ తో సినిమాలు నిర్మించబోతున్నారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కిరాక్ పార్టీ, గూడచారి, సీత, ఏ 1 ఎక్స్ ప్రెస్ సినిమాలతో పాటు ఇటీవలి రాజ రాజ చోర నిర్మించారు.  మరోవైపు, ఏషియన్ థియేటర్స్ అధినేతలైన సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ లు నిర్మించిన లవ్ స్టొరీ ఇటీవలే విడుదలై విజయం సాధించింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ తో ‘అనుభవించు రాజా’, నాగ శౌర్య తో ‘లక్ష్య’ నిర్మిస్తున్నారు. ఇకపై ఈ రెండు సంస్థలు కలిసి భారీ చిత్రాలను నిర్మించేందుకు రెడీ అయ్యారు. త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నారు. ఇలా యంగ్ అండ్ సీనియర్ నిర్మాతలు కలవడంతో సరికొత్త ప్రాజెక్ట్‌ లు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ పస్ల్ కమర్షియల్ హంగులతో భారీ చిత్రాలు రాబోతోన్నట్టు కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular