Saturday, January 18, 2025
HomeసినిమాJr NTR, Rahul Sankrityan: ఎన్టీఆర్, రాహుల్ మూవీ నిజమేనా..?

Jr NTR, Rahul Sankrityan: ఎన్టీఆర్, రాహుల్ మూవీ నిజమేనా..?

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్, సైఫ్‌ ఆలీఖాన్ ల పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. రాహుల్ సాంకృత్యన్ విజయ్ దేవరకొండతో టాక్సీవాలా చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా సక్సెస్ సాధించింది. ఆతర్వాత నానితో శ్యామ్ సింగ రాయ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా విజయం సాధించింది. ఆతర్వాత టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో కథ రాస్తున్నాడని.. నాగచైతన్యతో సినిమా చేయనున్నాడని ప్రచారం జరిగింది కానీ.. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇప్పుడు ఎన్టీఆర్ కోసం రాహుల్ ఓ పీరియాడికల్ స్టోరీ రాశాడట. ఈ కథలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయట. ఈ కథ విని ఎన్టీఆర్ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతుంది. అయితే.. రెండు సినిమాల ఎక్స్ పీరియన్స్ ఉన్న రాహుల్ తో ఎన్టీఆర్ సినిమా చేయడానికి ఓకే చెప్పాడా అనేది హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న దేవర నవంబర్ కి పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ నుంచి వార్ 2 మూవీ షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారు. దేవర, వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ చేయాల్సివుంది. ఈ సినిమాలు కంప్లీట్ కావడానికి చాలా టైమ్ పడుతుంది. మరి.. ఎన్టీఆర్ కోసం రాహుల్ కొన్నాళ్లు వెయిట్ చేస్తాడా..? ఈలోపు మరో సినిమా చేస్తాడా..? అసలు ప్రచారంలో ఉన్న వార్త నిజమా కాదా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్