Tuesday, March 10, 2026
HomeసినిమాNTR30: కొరటాల సినిమాలో ఎన్టీఆర్ రెండో జోడీగా ఆషిక రంగనాథ్?

NTR30: కొరటాల సినిమాలో ఎన్టీఆర్ రెండో జోడీగా ఆషిక రంగనాథ్?

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన గ్లామరస్ హీరోయిన్స్ లో ఆషిక రంగనాథ్ ఒకరు. కల్యాణ్ రామ్ హీరోగా చేసిన ‘అమిగోస్ ‘ సినిమాతో ఈ సుందరి తెలుగు తెరపై మెరిసింది. తమలపాకులా తెరపై నాజూకుగా కనిపించిన ఈ బ్యూటీని చూసి కుర్రాళ్లంతా మనసులు  పారేసుకున్నారు. కృతి శెట్టి .. శ్రీలీల తరువాత స్థానంలో ఈ కోల కళ్ల కోమలి హవా కొనసాగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపించింది. అయితే దురదృష్టం కొద్దీ ఆ సినిమా ఆడలేదు.

అయితే ఒకప్పటి భాగ్యశ్రీ మాదిరిగా ప్రత్యేకమైన ఆకర్షణ ఉన్న ఆషికకు అవకాశాలు తప్పకుండా వస్తాయనే అభిమానులు భావించారు.. అందుకు తగినట్టుగానే ఇప్పుడు ఆమె పేరు ఎన్టీఆర్ జోడీగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాలతో చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడు. బలమైన కథాకథనాలతో ఈ సినిమా ఎన్టీఆర్ రేంజ్ ను పెంచేదిలా ఉంటుందని కొరటాల ఆల్రెడీ చెప్పాడు.

అలాంటి ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయికగా చోటు ఉందనే టాక్ వచ్చింది. సెకండ్ హీరోయిన్ గా కృతి శెట్టి .. అనన్య పాండే పేర్లు వినిపించాయి. తాజాగా ఆషిక రంగనాథ్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఆమెనే తీసుకుంటారా లేదా అనే విషయంలో స్పష్టత రావాలంటే, అధికారిక ప్రకటన రావాల్సిందే.

Also Read : #NTR30: అంగరంగ వైభవంగా  ‘ఎన్టీఅర్ 30’ ప్రారంభం 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular