Wednesday, March 18, 2026
Homeసినిమాఎన్టీఆర్, కొరటాల మూవీ ముహుర్తం ఫిక్స్..?

ఎన్టీఆర్, కొరటాల మూవీ ముహుర్తం ఫిక్స్..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో మూవీ అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీకపూర్ నటించనుంది. భారీ పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేశారు. అయితే.. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజై దాదాపు సంవత్సరం అవుతుంది అయినప్పటికీ ఇంకా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయకపోవడంతో అభిమానులు అప్ డేట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం.. అవి వైరల్ అవ్వడం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే.. ఎన్టీఆర్, కొరటల మూవీకి ముహుర్తం ఫిక్స్ అయ్యిందని తెలిసింది. ఇంతకీ ఎప్పుడంటే.. ఈ నెల 23న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇక మార్చి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఈ మూవీ కోసం హైదరాబాద్ శివార్లో ఓ పోర్ట్ సెట్ కూడా వేస్తున్నారు. సంగీత సంచలనం అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటించే నటీనుటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది త్వరలో ప్రకటించనున్నారు.  షూటింగ్ స్టార్ట్ చేయకుండానే.. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టుగా రిలీజ్ డేట్ కూడా ముందుగానే ప్రకటించడం విశేషం. మరి.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular