Sunday, January 19, 2025
Homeసినిమాఆర్ఆర్ఆర్.. ఐడీ కార్డ్ తో ఎన్టీఆర్

ఆర్ఆర్ఆర్.. ఐడీ కార్డ్ తో ఎన్టీఆర్

ఎన్టీఆర్ ఏంటి..? ఐడీ కార్డ్ వేసుకోవడం ఏంటి..? అనుకుంటున్నారా..? మన దేశంలో షూటింగ్ అయితే.. ఐడీ కార్డ్ అవసరం ఉండదు కానీ.. విదేశాల్లో షూటింగ్ అంటే.. తప్పనసరిగా ఐడీ కార్డ్ ఉండాల్సిందే. ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అందుకే ఎన్టీఆర్ ఐడీ కార్డ్ వేసుకున్నాడు. నేను ఐడీ కార్డు వేసుకుని చాలా సంవత్సరాలైంది. తొలిసారి సెట్స్‌లో ఇలా.. అంటూ ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఎన్టీఆర్. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు రాజమౌళి కూడా తన ఐడీ కార్డు చూపిస్తూ కనిపించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది ఆర్ఆర్ఆర్. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంచలన చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన దోస్తీ సాంగ్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేసిందని చెప్పచ్చు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ పాన్ ఇండియా మూవీని దసరా కానుకగా 2021, అక్టోబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్