Sunday, January 19, 2025
Homeసినిమారాజకీయ నాయకుడుగా ఎన్టీఆర్.?

రాజకీయ నాయకుడుగా ఎన్టీఆర్.?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13 విడుదల కావాలి కానీ.. కరోనా కారణంగా వాయిదా పడింది. 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్‌, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నట్టు ఇటీవల అఫిషియల్ గా ప్రకటించారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ నాయకుడుగా నటించనున్నారని.. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని.. అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఈ డిమాండ్ కాస్త ఎక్కువ అయ్యింది. ఇలాంటి టైమ్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసే సినిమాలో రాజకీయ నాయకుడుగా నటించనున్నారని వార్తలు రావడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది. మరి.. ఎన్టీఆర్ కానీ.. ప్రశాంత్ నీల్ కానీ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్