Saturday, March 7, 2026
Homeసినిమాస్పీడ్ పెంచిన ఎన్టీఆర్ 

స్పీడ్ పెంచిన ఎన్టీఆర్ 

ఎన్టీఆర్ అభిమానులంతా ఇప్పుడు ‘దేవర సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా రానుంది. యువసుధ ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన పాటకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించనుండటం .. ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ ఎంట్రీ ఇస్తుండటం ప్రత్యేకమైన ఆకర్షణగా మారనుంది.

ఈ సినిమానుంచి అభిమానులతో పెద్దగా గ్యాప్ లేకుండా తన ప్రాజెక్టులను ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడనే విషయం అర్థమవుతోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం ఎన్టీఆర్ చాలా సమయాన్ని కేటాయించాడు. ఆ సినిమా తరువాత ‘దేవర’ పట్టాలెక్కడానికి కూడా చాలా సమయం పట్టింది. అందువలన ఎన్టీఆర్ కి తన అభిమానులతో గ్యాప్ వచ్చేసింది. అందువలన ఇకపై అంత గ్యాప్ రాకుండా ఆయన తన ప్రాజెక్టుల విషయంలో కేర్ తీసుకోవడం కనిపిస్తోంది.

ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ ప్రాజెక్టుగా చెప్పుకునే ‘వార్ 2’ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘దేవర ‘ కూడా వచ్చే ఏడాదిలోనే థియేటర్లకు తీసుకుని రానున్నారు. అలా వచ్చే ఏడాది ఎన్టీఆర్ నుంచి రెండు భారీ సినిమాలు పలకరించనుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఆ తరువాత వరుసలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. 2026 జనవరిలో ఈ సినిమా విడుదల కానుంది. చూడాలి మరి, ఈ పాన్ ఇండియా సినిమాలతో ఎన్టీఆర్ ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular