Sunday, January 19, 2025
Homeసినిమాతారక్.. బాబాయ్ బర్త్ డేని మరిచిపోయావా..?

తారక్.. బాబాయ్ బర్త్ డేని మరిచిపోయావా..?

బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు కానీ.. తారక్ మాత్రం బాబాయ్ కు బర్త్ డే విషేష్ చెప్పలేదు. డైరెక్ట్ గా ఫోన్ లో చెప్పేరేమో కానీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం చెప్పలేదు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ టీజర్ గురించి అయినా ట్వీట్ చేయచ్చు కానీ.. అది కూడా చేయలేదు. దీంతో మరోసారి బాబాయ్, అబ్బాయ్ మధ్య ఉన్న గ్యాప్ వార్తల్లోకి వచ్చింది. బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ ఉండడంతో అభిమానులు కూడా కొంత మంది బాలయ్య వైపు, మరి కొంత మంది తారక్ వైపు డివైడ్ అయ్యారు. కొంత మంది మాత్రం ఇద్దరినీ అభిమానిస్తున్నారు. గతంలో తారక్.. బాబాయ్ బాలయ్యకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం ఏమైందో చెప్పలేదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్