Tuesday, March 10, 2026
HomeTrending Newsఆందోళన విరమించిన జూడాలు

ఆందోళన విరమించిన జూడాలు

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి సమ్మె చేస్తున్న జునియర్ డాక్టర్లు నేడు సమ్మె విరమించారు. ఈ అర్ధరాత్రి నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. మధ్యాహ్నం వైద్యశాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వి సమక్షంలో జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.  ఇటీవల ప్రకటించిన 15 శాతం స్టైఫెండ్ పెంపుపై ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం మిగిలిన మూడు డిమాండ్లపై రెండ్రోజుల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.

అన్ని డిమాండ్లు నేరవేరక పోయినా, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన సానుకూల స్పందన తో ఆందోళన విరమించామని, ప్రజా ఆరోగ్యం కోసం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని జూనియర్ డాక్టర్ల సంఘం నేతలు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular