Sunday, February 23, 2025
HomeTrending NewsAP High Court: చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం

AP High Court: చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చీఫ్ జస్టిస్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు, శాసనమండలి డిప్యూటీ చైర్మ్‌న్‌ జకియా ఖానమ్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువులు న్యాయమూర్తులు, ఉపముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ఇతర ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌కి  సిఎం జగన్  పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం హై టీ కార్యక్రమంలో అతిథులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్