Saturday, January 18, 2025
HomeTrending NewsSSA: విద్యా వ్యవస్థకు పునాది సర్వశిక్ష అభియాన్ - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

SSA: విద్యా వ్యవస్థకు పునాది సర్వశిక్ష అభియాన్ – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

క్రమబద్దీకరణతోనే ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని, సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి సందర్శించి, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించారన్నారు. రాష్ట్రం ఏర్పడితే ఉన్న ఉద్యోగాలతోపాటు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.

ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ప్రధానమని, చాలీచాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. విద్యా, వైద్యం అందరికీ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ విద్యా వ్యవస్థకు వారధులని, మహిళా ఉద్యోగికి కల్పించిన ప్రసూతి సౌకర్యం కూడా, ఆడబిడ్డల అందరికీ ప్రసూతికి ఆరు నెలలు సెలవులు కల్పించాలన్నారు. వేత భత్య సవరణ పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా పీ ఆర్ సీ ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 1.60 కోట్లు బడ్జెట్ ఐదు ఇంతలు పెరిగినా వేతనాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదన్నారు.

రాష్ట్ర ఏర్పాటు నేడు రు.65 వేల కోట్ల ఉన్న బడ్జెట్ ఐదింతలు బడ్జెట్ పెరిగిందన్నారు. ఉద్యోగుల వేతనాలు ఐదింతలు ఇవ్వాలన్నారు.సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ప్రాథమిక స్థాయి పాఠశాలలో మౌలిక వసతుల కల్పన ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో అన్ని నివేదికలు రూపొందించి, అడుగడుగునా విద్యా వ్యవస్థకు అండగా ఉంటామన్నారు. ఎన్నికల షెడ్యూలుకు ముందే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు అండగా ఉంటానని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట పిసిసి ప్రచార కమిటీ సభ్యులు బండ శంకర్, రఘువీర్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్