Saturday, January 18, 2025
HomeTrending Newsకాంగ్రెస్ గూటికి కే కేశవరావు

కాంగ్రెస్ గూటికి కే కేశవరావు

బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత కే కేశవరావు ప్రకటించారు. పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు. గురువారం ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసి.. తన నిర్ణయాన్ని అధినేత ముందు ఉంచారు. కేకే తీరుపట్ల కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాకు సొంత ఇళ్లు అని వెల్లడించారు. తీర్థ యాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు…. నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్ లో చేరుత అన్నారు. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత ఇంటికి వెళ్లాలన్న ఆలోచన తనకు కూడా ఉన్నదన్నారు.

53 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో పని చేశాను…బిఆర్ఎస్ లో నేను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమే…తెలంగాణ కోసమే బిఆర్ఎస్ లో చేరిన అని కేకే స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చింది….నేను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని గుర్తు చేశారు.

నేను పుట్టింది, పెరిగింది, కాంగ్రెస్ లోనే….ఆ పార్టీలోనే చనిపోవాలని అనుకుంటున్న….నేను బిఆర్ఎస్ కు ఇంకా రిజైన్ చేయలేదని పేర్కోన్నారు. నా కూతురు చేరిన రోజు నేను కాంగ్రెస్ లో చేరడం లేదు….ఏ రోజు కాంగ్రెస్లో చేరేది తేదీ ఖరారు అయిన తర్వాత చెబుతానన్నారు. నా కుమారుడు(విప్లవ్) మాత్రం బిఆర్ఎస్ లోనే ఉండాలి అనుకుంటున్నారని చెప్పారు.

ఇక కేకే నివాసానికి మాజీ ఇంద్ర కరణ్ రెడ్డి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇంద్ర కరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారనేది బహిరంగ రహస్యం.

బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు కొత్త కాదు. ఉద్యమ కాలంలో తెలంగాణ ద్రోహులు వెన్నుపోటు పొడిస్తే… పదేళ్ళ అధికారంలో కెసిఆర్ అరాచకాలు…నియంతృత్వం.. కుటుంబ పెత్తనం సహించిన పార్టీ నేతలు బంధ విముక్తులు అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్