Saturday, January 18, 2025
Homeసినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’ టీజర్ కు అనూహ్య‌ స్పంద‌న‌

 పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కడువా’ టీజర్ కు అనూహ్య‌ స్పంద‌న‌

Kaduva:  మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌ టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్‌ టైనర్‌ గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్‌, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా అలరించింది ‘కడువా’టీజర్.’ ఆయనొక చిరుత .. వేట కోసం కాచుకున్న చిరుత’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో వీర లెవల్ లో పృథ్వీరాజ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ సాలిడ్ గా వుంది. పృథ్వీరాజ్ యాక్షన్, మాస్ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ లో వున్నాయి. మరో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో వివేక్ ఒబెరాయ్‌ కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. టీజర్ చివర పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేసింది.

డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్ ని చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా వున్నాయి. అభినందన్ రామానుజం అందించిన విజువల్స్ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన నేపధ్య సంగీతం మాస్ ని మరింత ఎలివేట్ చేసింది. పృథ్వీరాజ్ హైవోల్టేజ్ యాక్షన్, భారీ నిర్మాణ విలువలు, మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్