Sunday, January 19, 2025
Homeసినిమాసెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళుతున్న కాజల్

సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకెళుతున్న కాజల్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైన అందాల చందమామ కాజల్ అగర్వాల్. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ చందమామ ఆతర్వాత పౌరుడు, ఆటాడిస్తా, మగధీర తదితర చిత్రాల్లో నటించి చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించి బాగా పాపులార్టీ సంపాదించిన కాజల్ అగర్వాల్ ఈమధ్య పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా..? లేదా అనుకుంటే.. చాలా తక్కువ టైమ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ నటించింది. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకెళుతుంది. ఈ మూవీ తర్వాత కాజల్ నుంచి రానున్న మూవీ ‘ఇండియన్ 2’. కమల్ హాసన్ హీరోగా శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇందులో కమల్ కు జంటగా నటిస్తుంది. అలాగే ఈ సినిమాతో పాటు సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీని కూడా చేస్తుంది. ఇటీవల స్టార్ట్ అయిన ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. అందుచేత సీనియర్ హీరోలకు కాజల్ మంచి ఛాయిస్ అని చెప్పచ్చు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు తెలుగులో లేటెస్ట్ గా మూడు సినిమాలకు ఓకే చెప్పిందట. త్వరలోనే ఈ సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ అగర్వాల్ దూసుకెళుతూ బిజీ అవ్వడం విశేషం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్