Saturday, January 18, 2025
Homeసినిమాఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసిన 'సత్యభామ' 

ఓటీటీ ట్రాక్ పైకి వచ్చేసిన ‘సత్యభామ’ 

నయనతార .. అనుష్క .. త్రిష వంటి సీనియర్ హీరోయిన్స్, నాయిక ప్రధానమైన కథలను ఎక్కువగా చేస్తూ వెళ్లారు. లేడీ ఓరియెంటెడ్ కంటెంట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే కాజల్ మాత్రమే నాయిక ప్రధానమైన కథల జోలికి అంతగా వెళ్లలేదు. సీనియర్ హీరోల జోడీగా ఆడిపాడటానికే ఆమె ప్రాధాన్యతనిస్తూ వెళ్లింది. ఇక ఈ మధ్య మాత్రం ఆమె రూట్ మార్చేసింది. ఆ కారణంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ‘సత్యభామ’.

ఈ సినిమా ఈ నెల7వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించలేకపోయింది. శశికిరణ్ – బాబీ – శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకి, సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. నవీన్ చంద్ర .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వారు దక్కించుకున్నారు. ఈ రోజు నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

కథ విషయానికి వస్తే.. సత్యభామ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆమెకి అమరేందర్ తో వివాహమవుతుంది. ఇద్దరూ చాలా హ్యాపీగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అవినీతిపరులకు సత్యభామ అంటే హడల్. ఎలాంటి కేసునైనా ఆమె ఎంతో ధైర్యంగా పరిష్కరిస్తూ ఉంటుంది. అలాంటి ఆమె దగ్గరికి హసీనా హత్యకేసు వస్తుంది. హసీనా ఎవరు? ఆమెను ఎవరు హత్య చేశారు? ఆ కేసు విషయంలో సత్యభామకు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్