Saturday, March 14, 2026
HomeTrending Newsఅధికారం, ఆదాయం కోసమే బాబు ఆరాటం: కాకాణి

అధికారం, ఆదాయం కోసమే బాబు ఆరాటం: కాకాణి

తనకు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర  ఉందని చెప్పుకునే చంద్రబాబు… ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే విచిత్రంగా ఉందని, ఆయన నిన్నో మొన్నో రాజకీయాల్లోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు ఏమీ చేయలేకపోయారని, తనకు అవకాశం ఇస్తే ఏదో చేస్తానని చెప్పడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయరు, విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పడం పరిపాటిగా మారిందన్నారు.

కోర్టులో కేసు ఫైళ్ళు మాయం కావడంపై తానే స్వయంగా కోర్టుకు హాజరై సిబిఐ విచారణ కోరారని ప్రస్తుతం వారు కేసును విచారిస్తున్నారని, చంద్రబాబుకు దమ్మూ ధైర్యం; నీతి నిజాయతీ ఉంటే ఆయనపై వచ్చిన ఆరోపణల విషయంలో సిబిఐ విచారణ కోరాలని కాకాణి సవాల్ విసిరారు. స్కిల్ కేసులో బాబుకు ఊరట తక్కలేదని… ఆయన అరెస్టును, విచారణను కోర్టు సమర్ధించిందని గుర్తు చేశారు. బాబు అవినీతిపై విచారణ కోరి తన పాతివ్రత్యం నిరూపించుకోవాలన్నారు.  చంద్రబాబు రా కదలిరా అంటే ఎవరూ కదిలి రావడం లేదని, ఆయన నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఆయన్ను మించిన దొంగ మరొకరు లేరని మంత్రి ఘాటుగా విమర్శించారు.

బాబు ఎప్పుడూ కియా గురించే చెబుతారని కానీ ఈ కంపెనీకి బీజం పడింది వైఎస్ హయంలోనేనని, ఈ విషయాన్ని బుగ్గన అసెంబ్లీ సాక్షిగా నిరూపించారని కాకాణి గుర్తు చేశారు. బాబు ఎప్పుడూ అధికారం కోసమే, ఆదాయం కోసమే పనిచేశారు కానీ.. అభివృద్ధి కోసం ఆలోచించలేదని ఫైర్ అయ్యారు. మైఖేల్ జాక్సన్ లాగా మీకు తగిలించుకొని అటూ ఇటూ తిరుగుతూ బ్రేక్ డ్యాన్స్ వేస్తూ బాబు ప్రసంగం ఇస్తున్నారంటూ గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular