Sunday, September 8, 2024
Homeసినిమాకనులవిందు చేస్తున్న కళావ‌తి సాంగ్

కనులవిందు చేస్తున్న కళావ‌తి సాంగ్

Record Views:  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న భారీ చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పై ఫ‌స్ట్ నుంచి భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీనికి తోడు ఫ‌స్ట్ లుక్ అండ్ టీజ‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో స‌ర్కారు వారి పాట పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి క‌ళావ‌తి అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేశారు. ఈ లిరిక‌ల్ వీడియో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. 24 గంట‌ల్లోనే అత్య‌ధికంగా చూసిన పాట‌గా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డుల‌ను క్రాస్ చేసి స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సాంగ్ 40 మిలియ‌న్ వ్యూస్ ని క్రాస్ చేసి దూసుకెళుతుంది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోన్న ఈ సాంగ్ కి క్రేజ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ పతాకాల పై సంయుక్తం గా నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మే 12 వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయ‌నున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్