Sunday, November 24, 2024
HomeTrending NewsBRS vs Congress: రైతులంతా ఓకే కులం - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

BRS vs Congress: రైతులంతా ఓకే కులం – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలో సుమారు 10 కోట్ల వ్యయంతో చేపట్టే బి.టి రోడ్డు నిర్మాణ పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం శంకుస్ధాపన చేశారు. 2.90 కోట్లతో తక్కురూ వాడ నుండి కుకునూర్ లింక్ వరకు బిటి రోడ్ నిర్మాణం పనులకు మోర్తాడ్ పెద్దవాగు రోడ్డు పై శంకుస్థాపన,6.80 కోట్ల వ్యయంతో మోర్తాడ్ నుండి బషీరాబాద్ వయా వడ్యాట్ బిటి రోడ్ డబుల్ లైన్ పనులకు మోర్తాడ్ మార్కెట్ వద్ద, వడ్యాట్ గ్రామంలో శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రైతులను,ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు..

మోర్తాడ్ ప్రాంత రైతులకు ప్యాకేజీ 21 ద్వారా ప్రతి 3ఎకరాలకు ఒక ఔట్లెట్ పెట్టి,మిషన్ భగీరథ లాగా ఇంటింటికీ నల్లా నీరు ఇచ్చినట్టు వ్యవసాయ పొలాలకు నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వర్షాలు రాకున్నా సాగు నీరు అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. కేసిఆర్ రైతు బంధు,రైతు భీమా,24 గంటల ఉచిత విద్యుత్,కరువు కాలంలో కూడా కాళేశ్వరం నీళ్లు ఇస్తూ రైతులకు భరోసాగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో రైతులకు హాని తలపెట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడు, మేమొస్తే 3గంటల కరెంట్ ఇస్తమని కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా,దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి పూట 3గంటల కరెంట్ ఇచ్చి రైతులను గోసపెట్టిన పాత రోజులు మళ్ళీ మనకు కావాలా..? రేవంత్ రెడ్డి మాటలపై రైతులు ఆలోచన చేయాలని మంత్రి కోరారు.

అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతులంతా ఓకే కులం..పార్టీలతో రైతులకు సంబంధం ఉండదన్నారు. సీఎం కేసిఆర్..పార్టీలకు,కులాలకు,రాజకీయాలకు అతీతంగా రైతులను అక్కున చేర్చుకున్నాడని గుర్తు చేశారు. కేసిఆర్ ఇచ్చే నీళ్లు,కరెంట్ ఒక్క బిఆర్ఎస్ రైతుల పొలాల్లోకే పోవు కదా..రైతులందరి ప్రయోజనాల కోసమే ఆలోచించే వ్యక్తి కేసిఆర్ అని అన్నారు. మంచి చేస్తున్న కేసిఆర్ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా రైతులు,ప్రజలు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. అభివృద్ది చేయడం మా వంతు…మాకు బలాన్ని చేకూరుస్తూ ఓటుతో ఆశీర్వదించడం మీ వంతు అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు కోటపాటి నర్సింహ నాయుడు,స్థానిక ప్రజాప్రతినిధులు,మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్