Friday, November 22, 2024
Homeసినిమాఅశ్వద్ధామ చుట్టూ తిరిగిన 'కల్కి' కథ!  

అశ్వద్ధామ చుట్టూ తిరిగిన ‘కల్కి’ కథ!  

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘కల్కి 2898 AD’ నిన్న థియేటర్లకు వచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు.  ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి, ఎప్పటికప్పుడు ప్రభాస్ అభిమానులలో ఆసక్తినీ .. ఆతృతను పెంచుతూనే వెళ్లింది. ఈ ప్రాజెక్టులోకి అమితాబ్ .. కమల్ ఎంటర్ కావడంతో మరింతగా ఈ సినిమాను గురించి మాట్లాడుకున్నారు. సైన్స్ ఫిక్షన్ లో ఇతిహాసానికి చోటు కల్పించడం అందరిలో మరింత ఉత్కంఠను రేకెత్తించింది.

అలాంటి ఈ కథ ఆడియన్స్ ను ఊరిస్తూ .. ఊరిస్తూ, నిన్న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది.  కథగా చూసుకుంటే .. మహాభారత యుద్ధంతో మొదలైన ఈ సినిమా, అక్కడి నుంచి వేల సంవత్సరాల ముందుకు వెళుతుంది. అశ్వద్ధామ పాత్రతో మొదలైన ఈ సినిమా, ఆయనతో పాటే నడుస్తూ వెళుతుంది. ఇతర పాత్రలు అలా వచ్చి వెళుతూ ఉంటాయి. కానీ అశ్వద్ధామ పాత్ర మాత్రం కీలకమైన స్థానంలో చివరివరకూ కొనసాగుతూ ఉంటుంది.

అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ నటన ఆకట్టుకుంటుంది. ప్రభాస్ భైరవ పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆడియన్స్ కీ .. అభిమానులకు ఎలాంటి నిరుత్సాహం కలిగించదు. కానీ నాగ్ అశ్విన్ అశ్వద్ధామ పాత్రపై ఎక్కువ కేర్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ప్రధానమైన ప్రతినాయకుడు కమల్ అయినప్పటికీ, సినిమా మొత్తం మీద ఆయన రెండుమూడు మార్లు మాత్రమే తెరపై కనిపిస్తాడు. ఇక ప్రభాస్ .. అమితాబ్ .. దీపిక పాత్రల చుట్టూనే మిగతా కథంతా తిరుగుతుంది. ఈ కంటెంట్ లో కథ కంటే వీ ఎఫ్ ఎక్స్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. నిడివి ఎక్కువగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్  ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్