Saturday, March 7, 2026
Homeసినిమా'కల్కి 2' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్!

‘కల్కి 2’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన అశ్వనీదత్!

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన ‘కల్కి 2898 AD’ విడుదలైన ప్రతి ప్రాంతంలో విజయవిహారం చేస్తోంది. ఈ సినిమాపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ, వసూళ్ల వర్షంలో అవి కొట్టుకుపోతున్నాయి. వసూళ్ల పరంగా ఏరోజుకారోజు ఫిగర్స్ మారిపోతున్నాయి. వీకెండ్ తరువాత కాస్త జోరు తగ్గే అవకాశం ఉందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా దూసుకుపోతూనే ఉంది.

కథ ప్రకారం ‘కల్కి’ అవతరించక ముందు కథనే ఇలా ఉంటే, సెకండ్ పార్టు మరో రేంజ్ లో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. దాంతో అభిమానులంతా ‘కల్కి 2’ గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘కల్కి 2’ ఎక్కడి నుంచి మొదలవుతుంది? సెకండు పార్టులో కొత్తగా మరెవరైనా స్టార్స్ కనిపిస్తారా? ఫస్టు పార్టులో వదిలేసిన రొమాంటిక్ టచ్ సెకండు పార్టులోనైనా ఉంటుందా? అనే సందేహాలను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత అశ్వనీదత్ దగ్గర సెకండ్ పార్టు గురించిన ప్రస్తావన రావడంతో  ఆయన తనదైన శైలిలో స్పందించారు.

‘కల్కి 2’ బ్యాలెన్స్ షూటింగు ఈ ఏడాది చివరలో మొదలవుతుందనీ, వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంటే ఫస్టు పార్టు సమయంలోనే సెకండు పార్టుకు సంబంధించిన చిత్రీకరణ చాలావరకూ జరిగిపోయిందన్నమాట. అందుకు సంబంధించిన వీ ఎఫ్ ఎక్స్ పనులు కూడా మొదలయ్యే ఉంటాయి. కనుక సెకండ్ పార్ధుకి సంబంధించిన చిత్రీకరణ కొంతకాలం షూట్ చేస్తే సరిపోతుంది. ఫస్టు పార్టులో కథ చివరికి చేరుకుంటూ ఉండగా కమల్ పాత్ర బలపడుతుంది. అందువలన సెకండ్ పార్టులో ఆయన పాత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అనుకోవలసి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular