Saturday, January 18, 2025
Homeసినిమాహాట్ టాపిక్ గా 'కల్కి' సక్సెస్ సెలబ్రేషన్స్! 

హాట్ టాపిక్ గా ‘కల్కి’ సక్సెస్ సెలబ్రేషన్స్! 

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎందరో ‘కల్కి 2898 AD’ గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంటుగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, వెయ్యి కోట్ల మార్క్ దిశగా పరుగులు తీస్తోంది. విడుదలైన చాలా ప్రాంతాలలో తన జోరు చూపిస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా ఇదే .. ఈ స్థాయి వసూళ్లను రాబడుతున్న సినిమా కూడా ఇదే. ఈ సినిమా కథాకథనాలపై కొన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, ఆడియన్స్ హోరులో అవి కొట్టుకుపోతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ‘కల్కి’ సినిమా కోసం భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహిస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఇంటర్వ్యూలు తప్ప ప్రమోషన్స్ పరంగా పెద్దగా ఖర్చు చేసింది లేదు. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కోసం డిఫరెంట్ గా రూపొందించిన ‘బుజ్జి’ అనే కారునే అన్ని ప్రాంతాలలో రోడ్లపై తిప్పారు. ప్రభాస్ నడిపిన కారు అనే క్రేజ్, ఆడియన్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను గుర్తుపెట్టుకునేలా చేసింది. ఈ సినిమాకి అది ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది.

ఇప్పుడు ఈ సినిమా వసూళ్లు .. రికార్డులు చూస్తుంటే సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఎక్కడ జరపనున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలో నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. అయితే అక్కడికి అమితాబ్ .. కమల్ .. దీపిక వాళ్లు వెళ్లడానికి ఇబ్బంది అవుతుంది. అందువలన ముంబైలో నిర్వహిస్తే బాగుంటుందేమో అని భావిస్తున్నారట. ఇంత పెద్ద సక్సెస్ ను తెలుగువారి మధ్య జరుపుకోవడమే కరెక్టేమో అనే సందిగ్ధంలో ఉన్నారని టాక్.  చూడాలి మరి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్