Monday, February 24, 2025
HomeTrending Newsకాళోజీ ప్రస్తావన లేకుండా ఉద్యమం లేదు - శ్రీనివాస్ గౌడ్

కాళోజీ ప్రస్తావన లేకుండా ఉద్యమం లేదు – శ్రీనివాస్ గౌడ్

ప్రజాకవి , పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 108 వ జయంతి ఉత్సవాల సంధర్బంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమములో బాగంగా కాళోజీ జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కాళోజీ పురాస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం,

ప్రజాకవి , పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రముఖ కవి, చరిత్ర పరిశోదకులు శ్రీరామోజు హరగోపాల్ కి రాష్ట్ర మంత్రులు శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ మహమూద్ అలీ అందజేశారు. కాళోజీ నారాయణరావు 108 వ జయంతి ఉత్సవాల సంధర్బంగా నిర్వహిస్తున్న తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమములో బాగంగా కాళోజీ జ్ఞాపకార్ధం రాష్ట్ర ప్రభుత్వం – తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ .. కాళోజీ నారాయణ రావు గారు గోప్ప కవి అని అన్నారు. వారి జయంతి ని తెలంగాణ భాషా దినోత్సవం గా జరుపుకోవడం అనందంగా ఉందన్నారు.  మరో మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాలికలు, కవులు, సాహితివేత్తలు, కళాకారులు, చరిత్రకారులు, సామాజిక వేత్తల, సంఘ సంస్కరణ వేత్తలతో పాటు మేదావులను గుర్తించి వారిని గౌరవిస్తున్నామన్నారు.

తెలంగాణ భాషా దినోత్సావాన్ని, కాళోజీ గారి పేరుతో ఎర్పాటు చేసిన అవార్డు కు ఎంపికైనా శ్రీరామోజు హరగోపాల్ గారిని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. శ్రీ హరగోపాల్ అందించిన సాహిత్యం, వారి చేస్తున్న సేవలను మంత్రి ఈ సందర్బంగా కోనియాడారు. ఉపాద్యాయుడుగా. చరిత్రపరిశోదకుడిగా బహుమఖ ప్రజ్ఞాశాలి గా అభివర్ణించారు. తెలంగాణ ఉద్యమంలో కాళోజీ ప్రస్తావన లేకుండా ఏ సభ, ఏ ఉపన్యాసం లేదంటే అతిశయోక్తి లేదన్నారు.

రాష్ట ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో వారి పేరు మీద ఒక సాహితీ పురస్కారం ప్రతి ఏటా ఇచ్చే ఏర్పాటు చేయడమే కాక, వారి జన్మదినం సెప్టెంబర్ 9ని “తెలంగాణ భాషా దినోత్సవం” గా అధికారికంగా ప్రకటించిందన్నారు. వరంగల్ లో కాళోజీ పేరిట ఆడిటోరియం నిర్మిస్తూన్నామన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా. కె వి రమణ, ప్రజా వాగ్గేయకారులు, ఎం ఎల్ సి. గోరెటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలురు గౌరిశంకర్, శ్రీమతి దీపిక రెడ్డి -తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మెన్, శ్రీమతి శ్రీదేవి – చైర్మెన్ తెలంగాణ అధికార భాషా సంఘం, ప్రముఖ కవి, జాతీయ అవార్డు పురస్కార గ్రహిత సుద్దాల అశోక్ తేజ, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమారు సుల్తానియా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లతో పాటు సాహిత్య ప్రియులు, పలువురు కవులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

Also Read: గొప్పవ్యక్తి రాజా వెంకట్రామరెడ్డి మంత్రి శ్రీనివాస్ గౌడ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్